సాయి పల్లవి నెక్స్ట్ తెలుగు సినిమా ఎవరితో?

మరిన్ని వార్తలు

పాన్ ఇండియా సినిమాలు రాకముందే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి. సాయి పల్లవికి అన్ని భాషల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆడియన్స్ కి సాయి పల్లవి అంటే గౌరవం తో కూడిన ప్రేమ. కారణం నటన ఒక్కటే కాదు ఆమె వ్యక్తిత్వం అన్నా చాలామందికి ఇష్టం. ఫిదా సినిమాతో తెలుగులో ఎంటర్ అయిన సాయి పల్లవి ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటుంది. తనకి ఉన్న క్రేజ్ తో సంపాదించాలని వచ్చిన ప్రతి ఆఫర్ ని ఒప్పుకోదు. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామన్నా, స్టార్ హీరో, దర్శకుడు ఈ లెక్కలేవి సాయి పల్లవి పట్టించుకోదు. తన మనసుకు ఆ పాత్ర కనక్ట్ అయితేనే చేస్తుంది. తన పాత్ర ఆడియన్స్ కి రీచ్ అవుతుందా? లేదా అన్నది మాత్రమే చూస్తుంది. అందుకే కెరియర్ స్టార్ట్ చేసి ఇన్నాళ్లు అయినా ఎక్కువ సినిమాలు చేయలేదు.

కొన్నాళ్ళు సినిమాలకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నితీష్ తివారీ రామాయణంలో రణభీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. తెలుగులో తండేల్ సినిమాతో జనవరిలో సందడి చేయనుంది. ప్రస్తుతం  పాన్ ఇండియా మూవీ 'అమరన్' తో హిట్ అందు కుంది. శివకార్తికేయన్ తో కలిసి నటించిన అమరన్ సినిమాలో సాయి పల్లవి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో అమరన్ రిలీజైంది. తమిళం పాటు తెలుగులో కూడా అమరన్ కి మంచి   పాజిటీవ్ టాక్ వచ్చింది. తెలుగులో భారీ ఓపినింగ్స్ రావడానికి కారణం సాయి పల్లవి అని చెప్పొచ్చు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సాయి పల్లవి మరో తెలుగు సినిమా కమిట్ అయ్యింది. ఈ న్యూస్ తెలియటంతో ఆ ప్రాజెక్ట్ ఏంటి? హీరో ఎవరు? అన్న ఆసక్తి అందరిలో మొదలైంది. కారణం సాయి పల్లవి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే కథకి ఓకే చెప్తుందని తెలియటమే. పాన్ ఇండియా హీరో  దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా గీతా ఆర్ట్స్ , స్వ‌ప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. అదే పవ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న 'ఆకాశంలో ఒక తార' మూవీ. ఈ సినిమా నుంచి ఇప్పటికే దుల్క‌ర్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు సాయి పల్లవి నటిస్తోంది అని తెలియగానే మరింత క్రేజ్ ఏర్పడింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS