సంచలన దర్శకుడు వర్మ పరిచయం చేసే హీరోయిన్స్ అందరిలోనూ హాట్ అప్పీల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎంతో కొంత టాలెంట్ లేకుండా ఈ ముద్దుగుమ్మలు తెరంగేట్రం చేయరు. ఇకపోతే తాజాగా వర్మ కంపెనీ నుండి పరిచయమై అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ ఇర్రా మోర్. 'భైరవగీత' సినిమా ద్వారా ఈ బ్యూటీ పరిచయమవుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మకి వర్మ సినిమాలో అవకాశం అంత ఆషామాషీగా ఏం రాలేదట. అక్కడున్నది వర్మ కదా.
అంత సులువుగా ఎంచుకుంటారా.? ఏంటీ.! వర్మ కంట్లో పడడానికి ముందే ఈ బ్యూటీ ఎంతో కష్టపడి నటనలో శిక్షణ తీసుకుందట. అదే ఆమెకు ప్లస్ అయ్యిందంటోంది. అన్ని రకాల హావభావాల్ని పండించగల స్టామినా ముందుగా శిక్షణ తీసుకోవడంతోనే వచ్చిందంటోంది. ఇకపోతే ఈ బ్యూటీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటంటే, ఇదీ అదీ అనేం లేదట. నటిగా గుర్తింపు తెచ్చే చిన్న పాత్రలైనా చేస్తానంటోంది. 'భైరవగీత'లో ముద్దు సీన్లపై అమ్మడి అభిప్రాయం అడిగితే, నేటి రోజుల్లో సినిమాకి సక్సెస్ ఫార్ములా అంటే లిప్‌లాక్ ఖచ్చితంగా ఉంటోంది.
సో లిప్‌లాక్స్‌కి నో అబ్జెక్షన్ అంటోంది ఇర్రామోర్. అలా అని ఏదో ప్రమోషన్స్ కోసమే లిప్‌లాక్స్ వాడతాం కానీ, కథకు అనుగుణంగా కాదు అంటే అస్సలు ఒప్పుకోదట ఈ హాట్ బ్యూటీ. స్టోరీ డిమాండ్ చేస్తేనే లిప్‌లాక్‌కి ఓకే చేస్తుందట. తొలి సినిమాతోనే తెలుగు భాషపై మక్కువ ఏర్పడిందనీ, తెలుగు నేర్చుకునేందుకు ట్రై చేస్తున్నాననీ, త్వరలోనే తెలుగులో మాట్లాడతాననీ ముద్దు ముద్దుగా చెప్పేస్తోందీ ముద్దుగుమ్మ ఇర్రా మోర్.