ప్రణయ్ - అమృత గాథ... తెలియంది కాదు. మారుతీరావు కథ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వర్మ ఈ ఎపిసోడ్ ఓ ఓ సినిమానే తీసేస్తున్నాడు. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో కూడా ఇలాంటి ప్రయత్నమే జరుగుతోందని టాక్. సాయి పల్లవి ప్రధాన పాత్రధారిగా వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఇది పరువు హత్యల నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. వెట్రిమారన్ కథలన్నీ యదార్థ సంఘటనల నుంచి పుట్టినవే అయ్యుంటాయి.
తను కూడా ప్రణయ్ - అమృత గాథ నుంచి స్ఫూర్తి పొందాడేమో అనిపిస్తుంది. సాయి పల్లవి తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించనున్నాడు. ప్రాణానికి ప్రాణంగా పెంచిన.. ఓ కూతురు, ఓ అబ్బాయితో ప్రేమలో పడి, తండ్రినే కాదంటే.. ఆ తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది? అనేదే ఈ వెబ్ సిరీస్ కథాంశమని తెలుస్తోంది. ఇది.. అటూ ఇటుగా ప్రణయ్ - అమృత గాథలానే ఉంది కదా? మరి ... అవునో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.