టైటిల్‌లోనే కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకుడు. మాస్ టైటిల్ మోజులోంచి హీరోలూ బయటకు వచ్చేస్తున్నారు. ఇన్నోవేటివ్ ప్రయత్నాలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. అందుకే అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి, చావు కబురు చల్లగా... లాంటి టైటిళ్లు వినిపిస్తున్నాయి. మురిపిస్తున్నాయి. తాజాగా.... సాయిధరమ్ తేజ్ సినిమాకి ఓ వెరైటీ టైటిల్ వెలుగులోకి వచ్చింది. అదే. `ఆహ్వానించువారు చీటీల చిట్టి`.
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా జయంత్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా రూపొందుతోంది. దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్ నిర్మాతలు. ఈ చిత్రానికి `ఆహ్వానించువారు చీటీల చిట్టి` అనే పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించేశార్ట. టైటిల్ ఎంత వెరైటీగా ఉందో, సినిమా కూడా అంతే వెరైటీగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ టైటిల్ నిజమో కాదో, ఇదే ఖరారు అవుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.