అడివి శేష్ టైటిల్ పాత్రధారిగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మేజర్'. సల్మాన్ ఖాన్ సరసన 'దబాంగ్ 3'లో నటించి, అందరి దృష్టినీ ఆకర్షించిన సయీ మంజ్రేకర్ (నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె) ఈ చిత్రంలో ఓ ఇంపార్టెంట్ రోల్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొననున్నారు. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో అమరుడైన ఎన్ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' చిత్రం రూపొందుతోంది.
తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ క్యారెక్టర్‌ను అడివి శేష్ పోషిస్తోండగా, గూఢచారి హీరోయిన్ శోభిత ధూళిపాళ ఓ ముఖ్య పాత్రను చేస్తున్నారు. ఇప్పటివరకు 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. 'మేజర్' మూవీని సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా, సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. 2021 సమ్మర్‌లో ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు.