ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా `ఆదిపురుష్`. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్లకు పైమాటే. ఈసినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ.. కళ్లన్నీ దీనిపైనే. ముఖ్యంగా బాలీవుడ్ వర్గాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్, కథ, తారాగాణం లాంటి విషయాలపై చర్చిస్తున్నాయి. బాలీవుడ్ మీడియా ఈ సినిమాపై ఫోకస్ పెంచేసింది. తాజాగా ఈసినిమాలో విలన్ ఎవరో ప్రకటించేసింది చిత్రబృందం. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తాడని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. తననే ఖరారు చేసింది.
సైఫ్ అలీ ఖాన్ ఎంపిక... చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. ప్రభాస్ ఎత్తుకీ, పర్సనాలిటీకీ ఇమేజ్‌కీ సైఫ్ సరితూగడన్నది అభిమానుల అనుమానం. పైగా రావణాసురుడి పాత్ర ఇది. రావణాసురుడు అంటే తెలుగువాళ్లందరికీ ఓ ఇమేజ్ ఉంది. రావణాసురుడు ఇలా ఉంటాడు.. అన్న ఊహ ఉంది. దానికి సైఫ్ సూట్ అవ్వడం లేదు. అయితే.. ఈ దర్శకుడు ఓం రౌత్కీ, సైఫ్ అలీఖాన్కీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అందుకోసమే.. సైఫ్‌ని తీసుకున్నాడట. దాంతోపాటు సైఫ్ ఈమధ్య నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్రలో బాగా రాణిస్తున్నాడు. అందుకే తనని తీసుకున్నారని టాక్. స్నేహం, అనుబంధం ఉంటే... బయట చూసుకోవాలి గానీ, దాని కోసం రావణాసురిడి పాత్రని సైఫ్ కి ఇస్తారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ విలన్ ముందే వీకైపోయాడు. సినిమాలో ఎలా ఉంటాడో?