కొత్త ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి!

మరిన్ని వార్తలు

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ఈ మధ్య షాకుల మీద షాకులిస్తోంది. ఇటీవలే తన కో క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ని లవ్‌ చేసి పెళ్లి చేసుకున్న సైనా నెహ్వాల్‌ వెరీ లేటెస్ట్‌గా బీజేపీ తీర్ధం పుచ్చుకుంది. ఓ వైపు ఆటలో కొనసాగుతూనే, మరోవైపు రాజకీయాలనూ టచ్‌ చేసిన ఈ డీసెంట్‌ గాళ్‌ ఇప్పుడు కొత్త అవతారమెత్తి అందర్నీ షాక్‌లో ముంచేసింది. క్రీడాకారిణిగా ఎప్పుడూ తన ఫోకస్‌ ఆట మీదే పెట్టింది కానీ, తానూ ఓ సెబ్రిటీనే కదా.. అని ఎప్పుడూ గ్లామర్‌ ఆలోచన చేసింది లేదు సైనా నెహ్వాల్‌ .అందుకే ఆమెపై అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అయితే, సడెన్‌గా సైనానెహ్వాల్‌ రూట్‌ మార్చేసింది. తనలోని గ్లామర్‌ యాంగిల్‌ని ఒక్కసారిగా బయట పెట్టేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🤩🤩

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

ఇంతకీ సైనా ఏం చేసిందో తెలుసా.? హాట్‌ హాట్‌గా ఫోటో షూట్‌ చేయించుకుంది. వోగ్‌ మ్యాగజైన్‌ కోసం అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఇంతకీ సైనా ఈ హాట్‌ ఫోటో సెషన్‌కి ఎందుకు శ్రీకారం చుట్టిందో ఏమో కానీ, ఆమె ఫ్యాన్స్‌ మాత్రం ఆ షాక్‌ నుండి తేరుకోలేకపోతున్నారు. ఒకవేళ సినిమాల్లో ఏమైనా ట్రై చేస్తుందా.? అని ఆశ్చర్యపోతున్నారు. ఓ వైపు స్పోర్ట్స్‌, మరోవైపు పాలిటిక్స్‌, ఇంకోవైపు సినిమాు ఇలా అన్నింట్లోనూ ఓ సారి వేలు పెట్టేద్దామనుకుంటుందో ఏమో కానీ, ఏది ఏమైతేనేం, ఈ ఫ్రెష్‌ ఫోటో షూట్‌లో సైనా కొత్తగుందిలే అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తుంటే, సైనాని ఇలా చూడడం కాస్త కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇంకొందరు . అన్నట్లు బాలీవుడ్‌లో ‘సైనా’ టైటిల్‌తో సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో పరిణీతి చోప్రా టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS