బాలీవుడ్‌లో మెరిసిపోవాలని సౌత్ భాము తహతహలాడడం సహజమే. అయితే, అంత సువుగా ఆ ఛాన్స్ వచ్చేయదు కదా. అఫ్‌కోర్స్ వచ్చినా తాప్సీలా ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేరు కూడా. కానీ, కోరి వచ్చిన ఆ గుడ్ ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకుంటానంటోంది ముద్దుగుమ్మ అమలాపాల్. ఇటీవల అమలాపాల్ నటించిన ‘ఆమె’ చిత్రం విడుదలకు ముందు ఏ స్థాయిలో సంచనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఆమె’లో అమలా పాల్ నటనకు ఇంప్రెస్ అయిన ఓ బాలీవుడ్ దర్శకుడు అమలాపాల్‌ని బాలీవుడ్‌కి రప్పించేశాడు. ఆయన మరెవరో కాదు, ప్రముఖ దర్శకుడు మహేష్ భట్.
అయితే, ఎప్పటి నుండో బాలీవుడ్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న అమలాపాల్, కోరి వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఒడిసి పట్టుకుందట. అయినా ఇప్పుడు వెబ్ సిరీస్‌ని అస్సలు తక్కువంచనా వేయడానికి లేదు. ఆ మాటకొస్తే, తొగులో స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న కైరా అద్వానీ, బాలీవుడ్‌లో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయిందంటే, అందుకు కారణం ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీసే. అలా అమలాపాల్ స్టార్‌డమ్ కూడా మారుతుందేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.