'స్వర్ణ సుందరి' 'మాగ్నెట్‌' సొగసులు చూస్తారా?

మరిన్ని వార్తలు

'నక్కో నక్కో..' అంటూ 'పోటుగాడు' సినిమాలో మంచు మనోజ్‌ పక్కన కిర్రాకు స్టెప్పులేసిన ముద్దుగుమ్మ సాక్షి చౌదరీ గుర్తుంది కదా. గుర్తు లేకపోయే ఫిగర్‌ కాదులెండి ఈ ముద్దుగుమ్మది. ఆ తర్వాత అల్లరి నరేష్‌తో 'జేమ్స్‌బాండ్‌' చిత్రంలో నటించింది. 

తాజాగా 'స్వర్ణ సుందరి' అనే పీరియాడిక్‌ మూవీలోనూ నటిస్తోంది. ఇకపోతే సరికొత్తగా అమ్మడు ఓ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. సినిమా పేరు 'మాగ్నెట్‌'. టైటిల్‌ విని ఇదేదో సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ అనుకునేరు. అందుకే విడుదలైన పోస్టర్స్‌పై ఓ లుక్కేస్కోంది. ఖచ్చితంగా అవాక్కవ్వాల్సిందే. స్వర్ణ సుందరి ఇప్పుడు మాగ్నెట్‌ సుందరిగా మారిపోయింది. హాట్‌నెస్‌లో సాక్షి చౌదరి టాప్‌ లెవల్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అయితే ఈ 'మాగ్నెట్‌' సినిమాలో ఇక ఏ రేంజ్‌లో హాట్‌నెస్‌ చూపించబోతోందో తెలుసా? అబ్బా ఆశ.. అప్పుడే చెప్పేస్తారు మరి. ఇదిగో ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ చూస్తుంటే ఓ అంచనాకి వచ్చేయొచ్చు. త్వరలోనే టీజర్‌ రాబోతోందట. ఇక ఫస్ట్‌లుక్‌ విషయానికి వస్తే ఒక అమ్మాయి. అబ్బాయి ముఖం మీద నుండి కాలు లేపి కాలితో అతని గెడ్డాన్ని తాకుతోంది. 

అలాగే మరో పోస్టర్‌లో బ్లాక్‌ హాట్‌ లేసుల బ్లౌజ్‌తో బ్యాక్‌ వంపులు చూపిస్తోంది. డెనిమ్‌ జీన్స్‌ షార్ట్‌ ఆమె వంపు సొంపుల్ని రెట్టింపు చేస్తుంటే, కుర్రకారుకు రెండు కళ్లూ చాలడం లేదు అమ్మడి అందాల్ని చూసేందుకు. ఎమ్‌.ఏ.ఎస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ 'మాగ్నెట్‌' చిత్రంసాక్షి చౌదరి ప్రధాన పాత్రలో రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS