గ్లామ్‌షాట్‌: బికినీ జూలు విదిలిస్తే, 'ప్యార్‌' మే పడిపోవాల్సిందే!

మరిన్ని వార్తలు

'ప్యార్‌ మే పడిపోయామె..' అంటూ 'పోటుగాడు' చిత్రంతో మనోజ్‌ సరసన హాట్‌ హాట్‌ స్టెప్పులేస్తూ, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ సాక్షి చౌదరి. హీటెక్కించే ఫిగర్‌, మత్తెక్కించే గ్లామర్‌.. ఇలా ఓ గ్లామరస్‌ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలూ అమ్మిలో పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి కాస్ట్యూమ్‌ వేసినా, ఇట్టే సూటయిపోతుంది ఈ పొడుగు కాళ్ల సుందరికి. అన్నీ ఉన్నా ఏదో అన్నట్లు, అవకాశాలు మాత్రం అరకొరగానే అంటుతున్నాయి. కానీ, ఎక్కడో చోట అడపా దడపా కనిపిస్తూనే కాలక్షేపం చేస్తోందీ సాక్షీ పాప.

 

అల్లరి నరేష్‌తో 'జేమ్స్‌ బాండ్‌ - నేను కాదు నా పెళ్లాం' సినిమాలో నటించి, యాక్షన్‌ ఇరగదీసేసింది. తర్వాత కూడా అల్లరోడే అమ్మడికి ఇంకో అవకాశమూ ఇచ్చాడు. అదే 'సెల్ఫీ రాజా'. రెండూ అంతంత మాత్రంగానే నిలిచాయి. తర్వాత 'సువర్ణసుందరి' అంటూ కత్తి పట్టి యుద్ధాలు కూడా చేసేసింది. 'ఊళ్లో పెళ్లి కుక్కల హడావిడి' అంటూ మరో కామెడీ చిత్రంలో నటించింది. కన్నడలోనూ ఓ సినిమాలో నటించింది.

 

ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ సర్దుకుపోవల్సిందే కదా. కానీ, ఎక్కడా ఆశించిన రిజల్ట్‌ అందడం లేదు పాపకి. కానీ, సోషల్‌ మీడియా విషయానికి వస్తే, పాప టాలెంట్‌ ఏంటో అర్ధమైపోతుంది. హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అనే రేంజ్‌లో అక్కడ అందాలు ఆరబోసేస్తుంటుంది. తాజాగా బ్లాక్‌ హాట్‌ బికినీలో సాక్షి చేసిన అందాల రచ్చ కెవ్వు కేకో కేకా.! చెప్పడం కన్నా, అర్జంటుగా మీరే ఓ లుక్కేసేసుకుంటే మస్త్‌ మజా ఆయెగా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS