వరుణ్, వితికా హౌస్‌లోకి ఏ పర్పస్‌తో ఎంట్రీ ఇచ్చారో ఆ పర్పస్‌ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. జంటగా ఎంట్రీ ఇచ్చిన వీరిరువురూ, హౌస్‌లో మసాలాని దట్టించడానికే అని ముందే అర్ధమైపోయింది. భార్య భర్తల మధ్య జరిగే గిల్లి కజ్జాలతో పాటు, చిన్న చిన్న రొమాన్స్, అప్పుడప్పుడూ కాస్త ఘాటు రొమాన్స్ కూడా చూపిస్తున్నారు. డ్యూయెట్స్ కూడా వేసుకుంటున్నారు. చీటికీ మాటికీ కోపంతో చిర్రుబుర్రులాడి, బుంగమూతి పెట్టే వితిక కోసం వరుణ్ సందేశ్ రొమాంటిక్ సాంగ్స్ వేసుకుంటున్నాడు. ముద్దు, ముచ్చట్లు తీరుస్తున్నాడు.
తాజా ఎపిసోడ్‌లోనూ అదే చేశారు ఈ జంట. వితిక కోపాన్ని చల్లార్చేందుకు బంగారం, బుజ్జి కొండా.. అంటూ బుజ్జగించి, శ్రీముఖి ఇష్యూ తీసుకొచ్చాడు వరుణ్ సందేశ్. శ్రీముఖితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా.. గొడవలెందుకు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, వితిక వామ్మో, కన్విన్స్ కాలేదు. అందర్నీ అర్ధం చేసుకుంటావ్. కానీ నేను నీకు అర్ధం కానే.. అంటూ భర్తను నిలదీసింది.
ఎప్పటిలాగే మళ్లీ అలక పాన్పు ఎక్కింది. ఆమెను కన్విన్స్ చేయడం వల్ల కాదని గ్రహించిన వరుణ్ సందేశ్ ఆ టాపిక్‌ని అక్కడే వదిలి పెట్టి, టాపిక్ డైవర్ట్ చేసేశాడు. అలా వీరిరువురి మధ్య జరిగిన రొమాంటిక్ కాన్వర్జేషన్ వీక్షకుల్ని రొమాంటిక్‌గా ఎంటర్టైన్ చేసింది. ఈ వారం ఈ జంటలో వితికా సేఫ్ జోన్లో ఉండగా, వరుణ్ నామినేషన్లో ఉన్నాడు.