ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం... సలార్. ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ తో దడదడలాడించిన ప్రశాంత్ నీల్... ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి యాక్షన్ సినిమా కావడంతో.. ఈ సినిమాలో ఫైట్ల పై ప్రశాంత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడట. ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్షన్ సీన్లు, అందులో ఎలివేషన్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. కేజీఎఫ్ లో ఫైట్లు ఎక్కువే. అవన్నీ సినిమానీ, హీరో క్యారెక్టర్‌నీ బాగా ఎలివేట్ చేశాయి. ఇప్పుడు `సలార్`లోనూ ఫైట్లకు కొదవ లేదని తెలుస్తోంది.
ఈ సినిమాలో దాదాపుగా 8 ఫైట్లు ఉంటాయని టాక్. ఇందులో నాలుగు ఫైట్లు నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో తెరకెక్కిస్తున్నార్ట. ఇప్పటి వరకూ 5 ఫైట్లు తీసేశారని, మరో మూడు ఫైట్ సీక్వెన్స్ బాకీ అని టాక్. ఈ ఫైట్ సీన్లు మొత్తంగా 30 నిమిషాల స్క్రీన్ టైమ్ తీసుకున్నాయట.
సలార్ రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని ఓ టాక్ వినిపిస్తోంది. రెండు భాగాలకు కలిపి 8 ఫైట్లా..? లేదంటే ఒక్క పార్ట్ లోనే 8 ఫైట్లు చూపిస్తారా? అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఒకే సినిమాలో 8 ఫైట్లు ఉంటే మాత్రం.. ఇక యాక్షన్ ప్రియులకు ఈ సినిమా పండగే అని చెప్పొచ్చు.