కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన సల్మాన్ ఖాన్ కి ఈరోజు జోధపుర్ కోర్టు ఒక శుభవార్త చెప్పింది.
వివరాల్లోకి వెళితే, సల్మాన్ 1998లో జరిగిన జింకల వేట కేసులో ప్రధమ ముద్దాయిగా ఉన్నాడు. 18 సంవత్సరాల పాటు సుదీర్గంగా సాగిన విచారణలో సల్మాన్ పాక్షికంగా బయటపడినట్టయింది ఈ తీర్పుతో. లైసెన్స్ లేని తుపాకులతో వేటాడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. కాని ప్రాసిక్యుషణ్ ఈ ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోయింది, దీనితో కోర్టు ‘ల్యాక్ అఫ్ ఎవిడెన్స్’ క్రింద సల్లూ భాయిని నిర్దోషిగా ప్రకటించింది.
ఈ సంఘటన జరిగినప్పుడు, పోలీసులు సల్మాన్ పై నాలుగు కేసులు పెట్టారు అందులో ఇపట్టికే మూడింట్లో నుండి బయటపడ్డాడు. నాలుగవ కేసు మాత్రం ఇంకా విచారణలో ఉంది. ఈ కేసు కూడా చివరి దశకు చేరుకునట్టు సమాచారం. మొత్తానికి సల్మాన్ ఖాన్ వరుసగా తనపైన ఉన్న కేసులనుండి మెల్లమెల్లగా బయటపడుతున్నాడు. ఈ మధ్య కాలంలో సంచలనం రేపిన ‘హిట్ అండ్ రన్’ కేసులో కూడా సల్మాన్ ‘ల్యాక్ అఫ్ ఎవిడెన్స్’ క్రిందనే బయటపడ్డాడు.
చూద్దాం మరి.. మిగిలి ఉన్న కేసులో ఏమైనా ట్విస్ట్ ఉంటుందో లేక తన సినిమాల క్లైమాక్స్ లో లాగా తనే గెలుస్తాడో చూడాలి.. ప్రస్తుతానికైతే “భాయి బచ్ గయా”.