1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌కి జోద్‌పూర్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. సల్మాన్‌ని దోషిగా నిర్ధారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద సల్మాన్‌పై 9, 51 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ సెక్షన్ల కింద కేసు నమోదైతే దాదాపు ఆరేళ్లు శిక్ష పడుతుంది. ఒకవేళ మూడేళ్ల కన్నా ఎక్కువ కాలం శిక్ష పడితే, సల్మాన్ పై కోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే రెండేళ్ల జైలు శిక్షే కాబట్టి తీర్పు వెలువరించిన జోధ్‌పూర్ న్యాయస్థానంలోనే బెయిల్‌కి అప్లై చేయొచ్చు సల్మాన్‌ఖాన్.
ఈ కేసులో నిందితులుగా ఆరోపించబడిన సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీ బింద్రే, నీలమ్‌లను నిర్దోషులుగా తేల్చింది కోర్టు. 1998లో వచ్చిన 'హమ్ సాథ్ సాథ్' సినిమా షూటింగ్ టైంలో ఈ నలుగురూ కృష్ణ జింకల వేట కేసులో ఇరుక్కున్నారు. అయితే తాజా తీర్పు ప్రకారం మిగిలిన వారు నిర్ధోషులుగా తప్పుకోవడంతో సల్మాన్ దోషిగా ప్రూవ్ అయ్యారు. గతంలో తప్పతాగి ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు సల్మాన్‌ఖాన్. అయితే ఆ కేసులో మొదట నిందితుడిగా ఆరోపించినప్పటికీ, తర్వాత కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంతో లక్కీగా ఆ కేసు నుండి బయట పడ్డాడు.
ఈ కేసులో కూడా మొదట ఎస్కేప్ అయినట్లే అనిపించినా, చివరికి న్యాయస్థానం దోషిగా తేల్చేసింది సల్మాన్‌ఖాన్‌ని. దాంతో అప్పుడు తప్పించుకున్నా, ఇప్పుడు బుక్ అవక తప్పలేదు సల్మాన్. పాపం సల్మాన్‌కి బ్యాడ్ టైం నడుస్తోంది కాబోలు. ఇటీవలే 'టైగర్ జిందాహై' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకున్నాడు సల్మాన్ ఖాన్.