కృష్ణ జింకలను వేటాడిన కేసులో 20 ఏళ్ల తర్వాత జోధ్‌పూర్ కోర్టు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కి ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆ నేపథ్యంలో మూడు రోజులుగా సల్మాన్‌ఖాన్ జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనకు కోర్టు కొన్ని షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50వేల రూపాయల పూచీకత్తుతో ఈ బెయిల్‌ని మంజూరు చేసింది.
సాయంత్రానికల్లా జైలు నుండి సల్మాన్ బెయిట్ మీద బయటికి వచ్చే అవకాశాలున్నాయనీ ఆయన తరపు న్యాయవాదులు మీడియాకు తెలిపారు. విచారణలో చాలా లోపాలున్నాయనీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఘటన జరిగిన సందర్భంలో ఆయన వద్ద ఏ రకమైన మారణాయుధాలు లేవనీ, ఆయనపై కేసులు పెట్టిన ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వలేదనీ సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాదులు కోర్టులో న్యాయమూర్తి ఎదుట వాదనకు దిగారు. దాంతో మరోసారి పరిశీలించిన న్యాయస్థానం కొన్ని షరుతులతో కూడిన బెయిల్‌ని సల్మాన్‌కి మంజూరు చేసింది.
దాంతో సల్మాన్‌ఖాన్‌కి బెయిల్ అయితే మంజూరైంది కానీ, కొన్ని షరతులను పాటించాలని కోర్టు ఆదేశించింది. గత 20 ఏళ్లుగా కోర్టులో నడుస్తోన్న ఈ కేసు ఇప్పుడు పరిశీలనకు వచ్చింది. ఎట్టకేలకు జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌ని దోషిగా నిర్ధారించి, తీర్పును వెలువరించింది. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో సల్మాన్‌కి తాత్కాలికంగా ఊరట లభించినట్లైంది.