టాలీవుడ్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించిన సంస్థ మైత్రీ మూవీస్. ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న ప్రొడక్షన్ హౌస్‌లలో మైత్రీ ఒకటి. టాలీవుడ్లో సూపర్స్టార్లతో సినిమాలు చేస్తూ.. తిరుగులేని బ్రాండ్ ఇమేజ్‌ని సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఏకంగా సల్మాన్‌ఖాన్‌తో ఓ సినిమానే ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి మైత్రీ మూవీస్ నిర్మాతలు సల్మాన్‌ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. పది కోట్లు అడ్వాన్స్ గా కూడా చెల్లించారని తెలుస్తోంది.
మైత్రీతో పనిచేయడానికి సల్మాన్ కూడా మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. సల్మాన్‌కి తగిన కథ దొరగ్గానే... ఈ కాంబో పట్టాలెక్కుతుంది. దర్శకుడిగా దక్షిణాదికి చెందినవాళ్లే ఉండాలని సల్మాన్ సూచించాడట. తెలుగు నుంచి ఓ దర్శకుడిని బాలీవుడ్‌కి తీసుకెళ్లి, సల్మాన్‌తో సినిమా చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. మరి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.