'బాహుబలి' సినిమాపై సల్మాన్‌ఖాన్ ఇంతకు ముందే స్పందించాడు. అద్భుతమైన సినిమాగా కొనియాడాడు. షారుక్‌ఖాన్, అమీర్‌ఖాన్ కూడా 'బాహుబలి' గురించి గొప్పగా మాట్లాడారు. లేటెస్ట్‌గా సల్మాన్‌ఖాన్ 'బాహుబలి' గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'బాహుబలి' సినిమాని 'ట్యూబ్‌లైట్' సినిమా వసూళ్ళ పరంగా అధిగమిస్తుందా? అని అడిగినప్పుడు, సల్మాన్‌ఖాన్ తాను అనుభవంలోంచి నేర్చుకున్న పాఠాల్ని వల్లెవేశాడు. ఓ సినిమా సాధించిన వసూళ్ళను ఇంకో సినిమా అధిగమించవలసిందే. అదే సినిమా ట్రెండ్. ఎప్పుడూ సినీ రంగంలో రికార్డులు పదిలంగా ఉండవు. ఈ విషయాన్నే చెప్పాడు సల్మాన్‌ఖాన్. 'సుల్తాన్', 'భజరంగీ భాయిజాన్' చిత్రాలతో రికార్డు వసూళ్ళను అందుకున్న సల్మాన్‌ఖాన్ నుంచి 'ట్యూబ్‌లైట్' సినిమా వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 'బాహుబలి ది బిగినింగ్' సాధించిన వసూళ్ళను కొన్ని సినిమాలు అధిగమించాయి. 'దంగల్' వసూళ్ళు 'బాహుబలి ది కంక్లూజన్' వచ్చేదాకా సరికొత్త రికార్డు. 'బాహుబలి ది కంక్లూజన్' వచ్చాక ఈక్వేషన్స్ మారాయి. కొత్త ఈక్వేషన్‌ని 'బాహుబలి ది కంక్లూజన్' సెట్ చేస్తే, చైనా 'దంగల్' విడుదలయ్యాక పరిస్థితి మళ్ళీ మారింది. కాబట్టి 'ట్యూబ్‌లైట్' వచ్చాక కొత్త ఈక్వేషన్ రావొచ్చు, దాన్ని ఇంకో సినిమా సాధించవచ్చు. ఈ విషయాన్ని చెబుతూ వసూళ్ళ గురించి పట్టించుకోకపోవడం వల్లే ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో తాను ప్రేక్షకుల్ని అలరించగలుగుతున్నట్లు వివరించాడు సల్మాన్‌ఖాన్.