తొలిసారి మెగాపవర్‌స్టార్‌తో జోడీ, కథకు కీలకమైన పాత్ర, పర్‌ఫామెన్స్ పరంగా అత్యంత క్లిష్టమైన పాత్ర. అదే రామలక్ష్మి పాత్ర. 'రంగస్థలం'లో రామలక్ష్మిగా నటించిన సమంత గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అంతవరకూ గ్లామర్ రోల్స్‌లో నటించి హీరోయిన్‌గా కమర్షియల్ హిట్స్ ఎన్నో తన ఖాతాలో వేసుకున్న సమంత 'రంగస్థలం' సినిమాతో కెరీర్‌లో ఓ స్టెప్ ముందుకు వేసింది. డీగ్లామర్ రోల్ అయితేనేం కెరీర్‌లో న భూతో న భవిష్యతి అనేంత గుర్తింపు తెచ్చుకుంది. ఆదే ప్రోసెస్‌ని ఇకపై కూడా కంటిన్యూ చేస్తానంటోంది.
ఆల్రెడీ 'రంగస్థలం' తర్వాత 'యూ టర్న్'తో ఓ ప్రయోగం చేసింది. ఇప్పుడు మరిన్ని ప్రయోగాలు సమంత కోసం లైన్‌లో ఉన్నాయి. భర్త చైతూతో కలిసి 'మజిలీ' అనే రొమాంటిక్ థ్రిల్లర్‌లో సమంత ప్రస్తుతం నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇకపోతే నందినీ రెడ్డితో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీలో సమంత నటించనుందట. ఇవన్నీ ఓ ఎత్తు. సమంత ఇప్పుడు చేస్తున్న సాహసం మరో ఎత్తు. గత కొంత కాలంగా సమంత ఓ అనూహ్యమైన పాత్రలో కనిపించబోతోందనీ ప్రచారం జరుగుతోంది. అది 60 ఏళ్ల బామ్మ పాత్రనీ తెలుస్తోంది.
అయితే పూర్తిగా ఆ విషయంలో క్లారిటీ రాలేదు కానీ, చూచాయగా సమంత ఓ హింట్ ఇచ్చింది. 'ఇంతవరకూ నేను నటించని, ఎవ్వరూ ఊహించని ఆశక్తికరమైన పాత్రలో కనిపించనున్నా. ఆ పాత్ర గురించి తెలుసుకుని చాలా భయపడ్డా. ఇబ్బంది పడ్డా.. కానీ ఛాలెంజ్‌గా తీసుకున్నా.. కొత్త ప్రయాణం మొదలు..' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది సమంత. అంటే ఆ ఆశక్తికరమైన పాత్ర ప్రచారంలో ఉన్నదేనా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!
Prepping for my most interesting charecter yet ... I’ve realised I get scared a lot , I am nervous all the time ,but I have never not accepted a challenge . Sometimes ,actually most times you are stronger than you think you are .. #newbeginnings pic.twitter.com/CcWZMuQmCr
— Samantha Akkineni (@Samanthaprabhu2) 30 November 2018