సమంత ప్రెగ్నెంట్ అట అనే రూమర్ మొన్నామధ్య తెగ హల్చల్ చేసింది. ఈ వార్తను ఖండిస్తూ, సమంత కొంచెం ఘాటుగానే స్పందించింది కూడా. అయినా ఈ రూమర్స్ ఆగడం లేదు. ఇటీవల సమంత 'మజిలీ', 'ఓ బేబీ' చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది. లేటెస్ట్గా మామ నాగార్జున 'మన్మధుడు 2' సినిమాలో గెస్ట్ రోల్లో తళుక్కున మెరిసింది. అయితే, ఈ సినిమా రిజల్ట్ బెడిసి కొట్టిందనుకోండి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సమంత చేతిలో పెద్దగా సినిమాలేమీ లేవు. కొత్త ప్రాజెక్టులపై కూడా సమంత సైన్ చేసినట్లు సమాచారం లేదు.
ఇదంతా చూస్తుంటే, సమంత జస్ట్ చిన్న బ్రేక్ తీసుకోవాలనుకుంటోందట.. అనే వార్త ఫ్రెష్‌గా హల్చల్ చేస్తోంది. ఈ బ్రేక్ వెనక కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఆ రీజన్స్‌కి కారణం సమంత పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటోందట. ఆ క్రమంలోనే మళ్లీ రూమర్స్ స్వైర విహారం మొదలెట్టేశాయి. ఒకవేళ ఈ రూమర్స్ నిజమే అయితే, ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి సమంత ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది.
పర్సనల్ ఇష్యూస్‌ని పంచుకోవడంలో సమంత కన్నా ఉత్సాహం చూపించేవారింకెవరుంటారు చెప్పండి. ఇదిలా ఉంటే, సమంత ప్రస్తుతం ఓ ప్రెస్టీజియస్ వెబ్ సిరీస్‌లో నటించబోతోందనీ, అందుకోసమే సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకోవాలనుకుంటోందనే టాక్ కూడా ఉంది. అసలు నిజమేంటో, అక్కినేని కోడలు రెస్పాండ్ అయితే కానీ తెలీదు.