కళ్లు చెదిరే 'యాక్షన్‌'తో విశాల్‌ '!

మరిన్ని వార్తలు

'అయోగ్య' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విశాల్‌ మంచి విజయం అందుకున్నాడు. తమిళంతో పాటు, తెలుగులోనూ ఈ సినిమాకి మంచి పేరొచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన 'టెంపర్‌'కి ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, విశాల్‌ తాజా చిత్రం సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో డిఫరెంట్‌ స్టంట్స్‌ చేయబోతున్నాడట విశాల్‌. యాక్షన్‌ సీన్స్‌ విశాల్‌కి కొత్తేమీ కాదు. కానీ, ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చేయని యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో విశాల్‌ నటించబోతున్నాడట.

 

డూప్స్‌ లేకుండానే ఈ క్రిటికల్‌ స్టంట్స్‌లో విశాల్‌ నటిస్తున్నాడట. యాక్షన్‌ ప్యాక్‌డ్‌ కంటెంట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి 'యాక్షన్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. తమన్నా ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా నటిస్తోంది. సుందర్‌, విశాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆంబల' మంచి విజయం దక్కించుకుంది గతంలో. సో తాజాగా ఈ కాంబో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. మలయాళ కుట్టి ఐశ్వర్యాలక్ష్మీ ఈ సినిమాతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది.

 

సెకండ్‌ హీరోయిన్‌గా ఐశ్వర్య నటిస్తోంది ఈ సినిమాలో. మిలిటరీ కమాండో ఆఫీసర్‌గా ఓ కీలకమైన అంశం గురించి, వివిధ దేశాల్లో తిరుగుతుంటాడు కథానాయకుడు. సో లొకేషన్స్‌ కూడా ఈ సినిమాలో కీలకం. ఇంతకు ముందెన్నడూ తమిళ సినిమాలో చూడని భిన్నమైన, కాస్ట్‌లీ లొకేషన్స్‌ని ఈ సినిమాలో చూపించబోతున్నారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS