రామలక్ష్మి డబుల్‌ ధమాకా.!

By Inkmantra - February 25, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

గతేడాది సమంత 'రంగస్థలం'లో రామలక్ష్మిగా ఎంట్రీ ఇచ్చి ఏడాది మొత్తం విజయాల్నే అందుకుంది. ఇప్పుడు చైతూతో 'మజిలీ' అంటూ రాబోతోంది. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. రామలక్ష్మిగా డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించిన సమంత, 'మజిలీ'లోనూ గ్లామర్‌ లుక్‌లో కనిపించదు. సాధారణ మధ్య తరగతి గృహిణి పాత్రలో సమంత కనిపించబోతోంది ఈ సినిమాలో. ఎక్కడా గ్లామర్‌కి చోటు లేదు. 

 

మరోవైపు తమిళంలో విజయ్‌సేతుపతితో జత కట్టిన 'సూపర్‌ డీలక్స్‌' మూవీ కూడా సమ్మర్‌లోనే విడుదల కానుంది. వారం రోజుల గ్యాప్‌లో ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రానుండడం విశేషం. ఈ సినిమాలో సమంత ఓ మోస్తరు గ్లామర్‌ ప్రదర్శించనుంది. పాత్ర పరంగా పార్‌ఫామెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందట ఈ సినిమాలో కూడా. ఇదిలా ఉంటే, సమంత నటిస్తున్న కొరియన్‌ రీమేక్‌ చిత్రం 'బేబీ - ఎంత సక్కగున్నావే' సినిమాలో మాత్రం సమంత ఫుల్‌ గ్లామర్‌గా కనిపించనుందట. ఇదో ప్రయోగాత్మక చిత్రమన్న సంగతి తెలిసిందే. 

 

నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సమంత హెవీ డోస్‌ గ్లామర్‌లో ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనుందనీ తాజా సమాచారమ్‌. 60 ఏళ్ల భామ టీనేజ్‌ గాళ్‌గా ఎలా మారిపోయింది.? ఆ పరిస్థితులు ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి అన్నదే ఈ సినిమా కథ. పర్‌ఫామెన్స్‌తో పాటు, గ్లామర్‌కీ ఎక్కువ స్కోపున్న సినిమా అట ఇది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట. ఇక ఈ ఏడాది సమంత ఎన్ని సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకోనుందో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS