కెరీర్ మొదట్లో ఉన్నప్పుడు ఏ క్యారెక్టర్ వచ్చినా ఒప్పుకోవాలి తప్పదు. ఎందుకంటే కెరీర్ నిలబెట్టుకుంటేనే కదా.. స్టార్డమ్ దక్కేది. స్టార్డమ్ వచ్చాక, దాన్ని కాపాడుకునే దిశగా అవకాశాలు ఎంచుకోవాలి. ఇక టాప్ లెవల్‌కి చేరుకున్నాక ఓ స్థాయి పాత్రలను మాత్రమే ఎంచుకోవాలి. ఇప్పుడు సమంత పరిస్థితి అదే. హీరోయిన్గా ఓ స్థాయికి చేరుకుంది సమంత. ఈ తరుణంలో వచ్చిన ప్రతీ పాత్రనూ ఒప్పుకోవడం లేదట సమంత. పాత్రకు ప్రాధాన్యత లేకపోతే, సున్నితంగా తిరస్కరిస్తోందట. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా ప్రాధాన్యత ఉన్న పాత్రలపైనే. అందులోనూ విలక్షణ పాత్రల పైనా ఉందంటోంది. అందుకే ఈ మధ్య చాలా అవకాశాల్ని సమంత వదిలేసిందట.
'రంగస్థలం'లో సమంత పోషించిన 'రామలక్ష్మి' పాత్రే చాలా గొప్పది అనుకుంటే, 'ఓ బేబీ' ఆమె కెరీర్లో ఓ మైల్ స్టోన్‌గా చెప్పుకోవాలి. ఆ తర్వాత చేయబోయే చిత్రాలు అంతకు మించి ఉండాలి. కానీ, అంతకు ఏమాత్రం తక్కువ కాకూడదు. తమిళ '96' రీమేక్‌లో సమంత ప్రస్తుతం నటిస్తోంది. దీంతో పాటు, ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. వెబ్ సిరీస్‌లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సమంత నుండి రాబోయే ప్రాజెక్టులు కూడా విలక్షణంగానే ఉండబోతున్నాయట. ముందు ముందు స్టన్నింగ్ అండ్ సర్ప్రైజింగ్ రోల్స్‌తో సమంత ఆకట్టుకుంటానంటోంది.