సింగర్ సినీత పాడిన పాటలు కంటే ఆమెపై వచ్చిన రూమర్స్ ఎక్కువ. తాజాగా మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది సునీత త్వరలో తల్లి కాబోతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై సునీత స్వయంగా స్పందించింది.'నేను ప్రెగ్నెంటా? ఆ విషయం నాకే తెలియదు. అలా రూమర్ పుట్టిస్తున్నారు అంటే వారి ఆలోచనా విధానానికే వదిలేస్తున్నా. వారు నన్ను నా జీవితాన్ని ఏం చేయలేరు' అని చెప్పుకొచ్చింది.
సునీతా రామ్ ని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. గతంలో వాటిపై స్పందిస్తూ.. ఇలాంటి విమర్శలు వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నేను తీసుకున్న నిర్ణయం మంచిది, చెడ్డది అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వాళ్లది. ఎవరి నిర్ణయాలు వాళ్లవి. గౌరవించాలనుకుంటే గౌరవిస్తారు. పనిపాట లేని వాళ్లు మాత్రమే ఇలాంటి విమర్శలు చేస్తుంటారు. పక్కవాళ్ల జీవితాల గురించి అనవసరంగా వ్యాఖ్యలు చేసి అమూల్యమైన సమయాన్ని ఎందుకు వృథా చేసుకుంటారో నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం నాజీవితం ఎంతో సంతోషంగా ఉంది. నేనింత ప్రశాంతంగా ఉన్నానంటే కారణం రామ్’’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సునీత తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయం కానున్నాడు. సర్కారు నౌకరి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.