స‌మంత వ‌ల్ల‌... ఎంత లేటు జ‌రిగిపోయిందో...?

By Gowthami - March 24, 2023 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

స‌మంత అనారోగ్యంతో `ఖుషి` సినిమా ఆల‌స్యం అవుతోంది. గ‌తేడాది డిసెంబ‌రులో రావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు ఈ యేడాది సెప్టెంబ‌రు 1కి వ‌స్తోంది. అంటే.. దాదాపు యేడాది లేట‌న్న‌మాట‌. మార్చిలో ఖుషి సినిమాకి స‌మంత కావ‌ల్సిన‌న్ని డేట్లు ఇవ్వబోతోంద‌ని, దాంతో.. సినిమా వేస‌వికి సిద్ధ‌మైపోతుంద‌ని అనుకొన్నారంతా. కానీ.. ఇప్పుడు లేటెస్టుగా `ఖుషి` రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది చిత్ర బృందం.

 

సెప్టెంబ‌రు 1న ఈ సినిమాని విడుదల చేస్తామ‌ని క్లారిటీ ఇచ్చింది. అంటే.. ఇంకో ఆరు నెల‌లు ఉంద‌న్న‌మాట‌. స‌మంత ఈ సినిమాకి బ‌ల్క్ కాల్షీట్లు ఇస్తే త‌ప్ప‌కుండా నెల రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్త‌య్యేది. కానీ స‌మంత అరోగ్యం ఇంకా పూర్తి స్థాయిలో స‌హ‌క‌రించ‌డం లేద‌ని, అందుకే ఈ సినిమా లేట్ అవుతోంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాకి స‌మంత నెల‌కు కేవ‌లం వారం రోజులే కేటాయిస్తోంద‌ని, అందుకే వేస‌విలో విడుదల కావ‌ల్సిన ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబ‌రుకి వెళ్లిపోయింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. క‌శ్మీర్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఇది. ఈ సినిమాలో స‌మంత పేరు.. ఖుషి. అందుకే ఆమె పేరు ఈ సినిమాకి టైటిల్ గా ఫిక్స్ చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS