పెద్ద తెరపై కన్నా, డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనే ఇప్పుడు స్టార్స్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మన అక్కినేని కోడలు సమంత కూడా ఆ దారిలోకి ఈ మధ్యనే మళ్లిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సమంత లీడ్ రోల్‌లో ‘ది ఫ్యామిలీ మేన్ 2’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇక, ఇప్పుడు సమంత ఇంకో స్టెప్ ముందుకేసింది. తానే నిర్మాతగా మారి, డిజిటల్‌లో సినిమాలు రూపొందించానుకుంటోందట.
సమంత నిర్మాణంలో రూపొందే డిజిటల్ మూవీస్ ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌లో ఉంటాయనీ అనుకుంటున్నారు. కుదిరితే, తానే నటిస్తుందట. లేదంటే, ఇతర నటీనటలతో ఆ మూవీస్ రూపొందిస్తుందట. ప్రస్తుతం పెద్ద తెర కన్నా, డిజిటల్ తెరకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న దరిమిలా, ఫ్యూచర్‌లో ఇది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. సో ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సమంత, ఇలా టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోపైపు సమంత భర్త, అక్కినేని బుల్లోడు నాగ చైతన్య కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వినిపించాయి. ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించనున్నారట. అదీ సంగతి. అలా ఈ లవబుల్ కపుల్ త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ని ఏలనున్నారన్న మాట.