హీరోయిన్ సమంత.. ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటుంది. ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌లో సరికొత్త లెవల్స్ అందుకోవడం ఆమెకే చెల్లింది. కష్టతరమైన వర్కవుట్స్‌ని సులువుగా చేసేస్తూ ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో వుంచుతూ, అభిమానుల్ని సైతం ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌గా మార్చేస్తుంటుంది సమంత. అసలు విషయమేంటంటే, ఆ ఫిట్‌నెస్ లెవల్స్ కారణంగానేమో.. సమంత చాలా సులువుగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనాన్ని కాలి నడకన ఎప్పటికప్పుడు పూర్తి చేసేస్తుంటుంది.
తాజాగా ‘జాను’ సినిమా కోసం మొక్కుకుందేమో, నిర్మాత దిల్ రాజుతో కలిసి తిరుమలకు కాలి నడకన వెళ్ళిపోయింది. దిల్ రాజు మొహంలో అలసత్వం కన్పిస్తోందిగానీ, సమంత మొహంలో అస్సలేమాత్రం అలసట తెలియడంలేదు. సమంతతో పోల్చితే దిల్ రాజు వయసు చాలా ఎక్కువ. ఆ సంగతి పక్కన పెడితే.. సుకుమారంగా కన్పించే సమంత, ఇంత టఫ్ టాస్క్‌ల్ని పూర్తి చేసేస్తుండడం ఆమె అభిమానుల్ని కొంత ఆశ్చర్యానికి గురిచేయడం సహజమే. చాలామంది హీరోయిన్లు తమ ఫిట్‌నెస్‌ని జివ్‌ులకే పరిమితం చేస్తుంటారు. కాస్తంత వేడిగా వుంటే తట్టుకోలేరు. కాస్త కష్టపడాల్సి వస్తే అంతే సంగతులు. కానీ, సమంత అలా కాదు.. తనను తాను ఎలాగైనా మార్చుకోగలదు. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు సోషల్ సర్వీస్.. ఇంత బిజీగా వుండి కూడా ఫిట్‌నెస్ విషయంలో సమంత చూపుతున్న శ్రద్ధకి హేట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.