విజయ్‌ దేవరకొండ అనే నేను..!

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ అనే నేను.. హామీ ఇస్తున్నాను.. అనే స్థాయిలో అభిమానులకి రౌడీ హీరో ఓ హామీ ఇచ్చేశాడు.. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ సాక్షిగా. ‘నేను చేసిన కొన్ని సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.. కొన్ని ఆడలేదు. కానీ, నేను మీకు హామీ ఇస్తున్నాను. నా నుంచి వచ్చే ప్రతి సినిమా మీకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది..’ అని విజయ్‌ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు అతని అభిమానుల్ని ఓ రేంజ్‌లో అలరించాయి. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా నుంచి విజయ్‌ దేవరకొండ స్టార్‌డవ్‌ు ఓ రేంజ్‌కి వెళ్ళిపోయింది. అక్కడినుంచి.. అతని రేంజ్‌ అలా అలా పెరుగుతూనే వుంది సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి అతీతంగా. తమిళంలో ‘నోటా’ చేశాడు.. ‘డియర్‌ దేవరకొండ’ సినిమాని నాలుగు భాషల్లో రిలీజ్‌ చేశాడు. నిర్మాతగా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కూడా తీశాడు.

 

ఇవన్నీ ఓ ఎత్తు.. విజయ్‌ దేవరకొండ ఆటిట్యూడ్‌ ఇంకో ఎత్తు. కొత్త ఏడాదిలో కొత్త కొత్త పనులు చేస్తున్నాం.. కొత్త ప్రయాణం షురూ చేశాం.. అని కూడా అభిమానులకి చెప్పాడు విజయ్‌ దేవరకొండ. ఆ కొత్త ప్రయాణం.. బాలీవుడ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఫైటర్‌’ బాలీవుడ్‌లో కూడా విడుదల కానున్న విషయం విదితమే. బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌, ఈ సినిమాని హిందీలో టేకప్‌ చేస్తున్నాడు. ఇక, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా విషయానికొస్తే, ఈ సినిమా తన కెరీర్‌లో ఇంకో స్పెషల్‌ ఫిలిం అని అంటున్నాడు విజయ్‌ దేవరకొండ. సినిమాలోని లవ్‌ స్టోరీస్‌ అందరికీ నచ్చుతాయని విజయ్‌ చెప్పుకొచ్చాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS