పూజా అవుట్.. స‌మంత ఇన్‌

By iQlikMovies - November 25, 2021 - 15:06 PM IST

మరిన్ని వార్తలు

త్రివిక్ర‌మ్ - మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. స‌ర్కారు వారి పాట త‌ర‌వాత‌... మ‌హేష్ చేయ‌బోయే సినిమా ఇదే. ఇందులో క‌థానాయిక‌గా పూజా హెగ్డేని ఎంచుకున్నారు. పూజా అయితే అటు త్రివిక్ర‌మ్ కీ, ఇటు మ‌హేష్‌కీ పూజా సెంటిమెంట్. పూజా క‌థానాయిక‌గా చేసిన `మ‌హ‌ర్షి` హిట్ అయ్యింది. ఇటు త్రివిక్ర‌మ్ కూడా... అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల‌తో సూప‌ర్ హిట్లు ప‌డ్డాయి. కాబ‌ట్టి... హిట్ కాంబోని రిపీట్ చేసిన‌ట్టు అయ్యేది.

 

కానీ.. రెండు రోజులుగా ఈ సినిమాలో క‌థానాయిక‌గా స‌మంత పేరు కూడా గ‌ట్టిగా వినిపించ‌డం మొద‌లైంది. దాంతో ఈసినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటారా? అనిపించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పోస్టు ఒక్క‌టే ఉంద‌ని, స‌మంత వ‌చ్చింది పూజా హెగ్డే ప్లేసులో అన్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. పూజా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌, కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోయింద‌ని, అందుకే స‌మంత‌ని తీసుకున్నార‌ని స‌మాచారం అందుతోంది. ఈ విష‌యంలో చిత్రబృందం నుంచి స్ప‌ష్ట‌త రావాల్సివుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS