పెళ్లిపై పెద‌వి విప్పిన‌.. ర‌కుల్ ప్రీత్ సింగ్‌

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లిళ్ల హ‌డావుడి క‌నిపిస్తోంది. హీరోలు, హీరోయిన్లూ...వైవాహిక జీవితం దిశ‌గా ఆలోచిస్తున్నారు. అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఇటీవ‌ల కార్తికేయ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌న్న‌ది లేటెస్ట్ టాలీవుడ్ టాక్‌. నిర్మాత‌ జాకీ భగ్నానీతో ర‌కుల్ డేటింగ్ లో ఉన్న విష‌యం తెలిసిందే. ఇద్దరి ప్రేమ వ్య‌వ‌హారం ఇటీవ‌లే బ‌య‌ట‌కు వ‌చ్చింది. వీరిద్ద‌రూ జంట‌గా ఉన్న ఫొటోలు కూడా టాలీవుడ్ లో వైర‌ల్ గా మారాయి. ఇప్పుడు వీరిద్ద‌రి పెళ్లి విష‌యంలో ఓ రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ర‌కుల్ - భ‌గ్నానీల పెళ్లి ఖాయ‌మైంద‌ని, ఈ డిసెంబ‌రులోనే ఇద్ద‌రూ ఒక్క‌ట‌వుతున్నార‌ని, పెళ్లి ముహూర్తం కూడా ఖాయ‌మైపోయింద‌ని, త్వ‌ర‌లోనే మ్యారేజ్ డేట్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని చెప్పుకుంటున్నారు.

 

దీనిపై ర‌కుల్ స్పందించింది. పెళ్లికి తొంద‌ర‌ప‌డ‌డం లేద‌ని, ఈ విష‌య‌మై వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని క్లారిటీ ఇచ్చేసింది. భ‌గ్నానీతో డేటింగ్ లో ఉన్న మాట నిజ‌మే కానీ, పెళ్లి గురించి ఇంకా ఆలోచించ‌లేద‌ని అంత టైమ్‌కూడా త‌న‌కు లేద‌ని తేల్చి చెప్పింది. పెళ్లి విష‌యంలో వ‌స్తున్న రూమ‌ర్ల‌పై స్పందించాల‌ని త‌న‌కులేద‌ని, త‌న‌కెప్పుడైనా అనిపిస్తే... ఈ విష‌యంపై మాట్లాడ‌తాన‌ని, పెళ్లి కుదిరితే మీడియాకు చెబుతాన‌ని, ఈ విష‌య‌మై చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా రాయొద్ద‌ని మీడియాని కోరింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS