సమంత జోరు పెంచింది. వరసపెట్టి కధలు వింటుంది. కొన్ని సినిమాలకు అంగీకారం కూడా తెలిపింది. పుష్పలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు సామ్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఓ హాలీవుడ్ సినిమాకి అంగీకారం తెలిపింది సమంత. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ తెరకెక్కించనున్న హాలీవుడ్ మూవీ ‘అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ చిత్రంలోసమంత కీలకపాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ ట్వీట్ చేసింది.
‘‘కొత్త ప్రపంచం. ‘అరెంజ్‌మెట్స్ ఆఫ్ లవ్’లో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా. అను పాత్ర కోసం నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ ఫిలిప్ జాన్. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ట్వీట్ చేసింది సామ్. ఇండియన్ రైటర్ తిమేరి ఎన్ మురారీ రచించిన ‘అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా చేసుకుని ఈసినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో సమంత పాత్ర కొంచెం బోల్డ్ గా ఉండబోతుందని టాక్. మొత్తానికి సమంత సినీ ప్రయాణంలో ఓ కొత్త అడుగు పడింది. సమంతకు బెస్ట్ విశేష్ .. చెబుతూ అల్ ది బెస్ట్ సామ్.