అక్కినేని కోడలు: ఉత్తమ నటి సరే, ఆ డ్రస్‌ సంగతేంటీ.?

మరిన్ని వార్తలు

సమంతా ప్రభు.. ఇప్పుడు అక్కినేని సమంతగా హోదా అంది పుచ్చుకుంది. ఎప్పుడయితే, అక్కినేని కోడలి హోదా అందుకుందో, ఆమె తీరు మొత్తం మారిపోయింది. ఆ తర్వాత నుండి సమంత నుండి వస్తున్న చిత్రాలన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఆమె పోషించే పాత్రల ఎంపిక కూడా ప్రశంసించదగ్గదిగా ఉంటోంది. అన్నింటికీ మించి సక్సెస్‌ ఆమె వెన్నంటే ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ, అప్పుడప్పుడూ సమంత నెటిజన్స్‌ నోళ్లలో నానాల్ని వస్తోంది. అందుకు కారణం బహిరంగ వేడుకల్లో ఆమె డ్రెస్సింగ్‌.

 

తాజాగా జీ సినిమా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో భాగంగా సమంత ధరించిన డ్రస్‌ పలు విమర్శలకు తావిస్తోంది. పూర్తిగా నెట్టెడ్‌ ప్యాటర్న్‌లో డిజైన్‌ చేసిన ఆ డ్రస్‌లో సమంత ట్రాన్స్‌పరెంట్‌ అందాలు కాస్త జుగుప్సాకరంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. నెటిజన్స్‌ అభిప్రాయం నెటిజన్స్‌దే. కానీ, సమంత ఇలాంటివేమీ అస్సలు పట్టించుకోదు. ఎంతైనా అక్కినేని కోడలు కదా.. అందులోనూ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ హోదాని హుందాగా అంది పుచ్చుకున్న ముద్దుగుమ్మ .. నెటిజన్స్‌ అభిప్రాయాల్ని కూడా కాస్త పరిగణలోనికి తీసుకుంటే బావుంటుందంటున్నారు. ఇకపోతే, 2019లో సమంత నుండి వచ్చిన 'మజిలీ', 'ఓ బేబీ' సినిమాలూ సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. హిట్‌ సంగతెలా ఉన్నా, ఉత్తమ నటిగా సమంతకు ప్రశంసలు దక్కాయి. అందుకే జీ సినిమా అవార్డ్స్‌లో సమంతను 'ఉత్తమ నటి' పురస్కారం వరించింది. ఉత్తమ నటుడిగా 'సైరా నరసింహారెడ్డి' సినిమాకి గాను మెగాస్టార్‌ చిరంజీవి అవార్డు అందుకున్నారు. 'ఇస్మార్ట్‌ శంకర్‌'కి ఉత్తమ డైరెక్టర్‌గా పూరీ జగన్నాధ్‌ అవార్డు దక్కించుకున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS