'రామలక్ష్మి' జీవించేసిందట!

By iQlikMovies - March 24, 2018 - 10:36 AM IST

మరిన్ని వార్తలు

తొలిసారి సమంత, రామ్‌చరణ్‌తో నటిస్తున్న చిత్రం 'రంగస్థలం'. అందుకే అత్యంత ప్రత్యేకమైన చిత్రం తనకి 'రంగస్థలం' అంటోంది అందాల సమంత. అదొక్కటే కాదు. ఈ సినిమాకి సంబంధించి తనకు చాలా ప్రత్యేకతలున్నాయంటోంది సమంత. అసలు ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటోంది సమంత. 

అందునా ఇలాంటి సినిమాలో తానూ ఓ పాత్ర చేస్తానని అస్సలు కలలో కూడా ఊహించుకోలేదని అంటోంది. అందుకే ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడిందట. పాత్రలో ఒదిగిపోవడడానికి చాలా హోం వర్క్‌ చేసిందట. ప్రతికూల వాతావరణంలో సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చిందట. ఈ సినిమా కోసం పడిన కష్టమంతా మర్చిపోయేలా ఖచ్చితంగా ఈ సినిమాకి మంచి విజయం దక్కుతుందని చెబుతుంది సమంత. ఈ రోజుల్లో అలాంటి పాత్రలో నటించడం అనేది ప్రతీ హీరోయిన్‌కీ ఓ కలలాంటిదే. కానీ ఆ కల నాకు నెరవేరిందని మురిసిపోతోంది సమంత. 

'రామలక్ష్మి'గా తన పాత్రను దర్శకుడు సుకుమార్‌ తీర్చిదిద్దిన వైనం ఎంత చెప్పినా తక్కువేనంటోంది. ఇక చరణ్‌ విషయానికి వస్తే, చరణ్‌తో తొలిసారి నటిస్తున్న చిత్రం అంటేనే స్వీట్‌ మెమరబుల్‌. అలాంటిది అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా ఈ సినిమా నిలవడం గోల్డెన్‌ ఆఫర్‌లాంటిదే అంటోంది సమంత. పల్లెటూరి యువతిలా నటించడం ఓ ఎత్తు, ఆ కాలంలోని పడుచు పిల్లలా కనిపించడం మరో ఎత్తు. ఓ సాహసంలా అనిపించినా, కెరీర్‌లో మర్చిపోలేని అనుభూతి 'రంగస్థలం' సినిమా అని చెబుతోంది సమంత.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS