తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతోన్న అందాల భామ సమంత పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్‌మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ, వారి ప్రశ్నలకు సమాధానాలిస్తూ, తన పర్సనల్ విషయాలూ, సినిమా సంగతులను సరదాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
టాలీవుడ్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతూనే, ఇండస్ట్రీలో అగ్ర కుటుంబానికి చెందిన అక్కినేని వారి కోడలిగా కూడా తన కీర్తిని మరింత పెంచుకుంది. గత ఏడాది అక్కినేని అందగాడు నాగచైతన్యను వివాహమాడిన సమంత వివాహా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, మరో పక్క సినిమాల్లో కూడా బిజీగా గడుపుతోంది. ఇటీవలే 'రంగస్థలం' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సమంత సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకుని భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.
ప్రస్తుతం కాశ్మీర్‌లోని మంచు కొండల అందాలను తన భాగస్వామితో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా సమంత సమాచారమిచ్చింది. మరోపక్క అభిమానుల వైపు నుంచే కాక, అక్కినేని ఫ్యామిలీ అయిన సుమంత్, సుశాంత్ తదితరులతో పాటు, కో స్టార్స్ రకుల్ ప్రీత్‌సింగ్, కీర్తి సురేష్, మంచు మనోజ్ ఇలా తదితర సినీ సెలబ్రిటీస్ నుండి బర్త్‌డే విషెస్ సమంతకు చేరుతున్నాయి. త్వరలోనే సమంత 'మహానటి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పక్క సమంత నటిస్తున్న 'యూ టర్న్' చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.