చిన్నా- పెద్దా తేడా లేదు. ఎవరికైనా పబ్లిసిటీ కావల్సిందే. ఓరకంగా పబ్లిసిటీ, మార్కెటింగ్ లోనే సక్సెస్ సీక్రెట్స్ దాగున్నాయి. ఆ విషయం సమంతకి బాగా తెలుసు. అందుకే కెరీర్‌లో ఇంత ఎత్తుకు ఎదిగింది. ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టేయడానికి సమాయాత్తం అవుతోంది. బాలీవుడ్ లో ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ మరింత పోటీ ఉంటుంది. దానికి తగ్గట్టే.. తన వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది సమంత.
ఇటీవల సమంత బాలీవుడ్ పై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో సమంత ఓ ఫ్లాట్ కూడా కొనుక్కుంది. బాలీవుడ్ అవకాశాలు ఎప్పుడొచ్చినా - అక్కడే మకాం ఉన్నట్టు ప్లాన్ చేస్తోంది. ఈలోగా బాలీవుడ్ లో పీఆర్ ని పెంచుకుంటోంది. ఓ మేనేజర్ ని నియమించుకుని అవకాశాలకు జల్లెడ పట్టే పనుల్లో ఉంది. అంతే కాదు.. ఓ పీఆర్ ఏజెన్సీని బాలీవుడ్ లో ఏర్పాటు చేసుకుంది. అక్కడి దిన పత్రికలు, టీవీలలో.. సమంతకు సంబంధించిన అప్ డేట్స్ తరచూ వచ్చేలా ప్లాన్ చేస్తోంది.
ఇదంతా బాలీవుడ్ లో తన మార్కెట్ ని సుస్థిరం చేసుకోవడానికే. ఇవన్నీ సత్ఫలితాల్ని ఇస్తున్నాయి. త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్టులో సమంత నటించబోతోందని సమాచారం. ఈ సినిమాతో.. బాలీవుడ్ లో సమంత తొలి అడుగు పడబోతోంది. తొలి సినిమా సెట్స్‌పై ఉండగానే.. తన పీఆర్‌ని పెంచుకుని, అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకునేందుకు సమంత సమాయాత్తం అవుతోందట. సమంత స్పీడు చూస్తుంటే, బాలీవుడ్ లో స్టార్ హోదా దక్కించుకోవడం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది