అందాల తార సమంతా ఈ మధ్యనే అఫీషియల్ గా అక్కినేని వారి ఇంటి కోడలు అయింది.
అలా జరిగి వారం రోజులు అయిన కాలేదు తన మామగారు అయిన నాగార్జునతో కలిసి నటించేందుకు ఒకే చెప్పేసింది. అందుతున్న సమాచారం ప్రకారం, సమంతా రాజు గారి గది-2 లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుందట. ఆల్రెడీ నాగార్జున రాకతో ఈ చిత్రం రేంజ్ పెరిగింది, ఇక ఈ అక్కినేని వారి కోడలు రావడంతో సినిమా యొక్క టోటల్ రేంజ్ వీరే లెవెల్ కి వెల్లినట్టయింది.
ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పీవిపీ నిర్మాణ బాధ్యతలు చూస్తున్నారు. ఇక షూటింగ్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ అయింది. చూద్దాం.. పోను పోను ఇంకెన్ని ట్విస్ట్లు వినబోతున్నమో...