సమంత, కీర్తి సురేష్‌లలో ఎవరెక్కువ?

మరిన్ని వార్తలు

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'మహానటి' సినిమాలో సమంత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత పాత్రే ఎక్కువ. కీర్తి సురేష్‌ పాత్ర తక్కువ అని ప్రచారం జరుగుతోంది. 

పోస్టర్స్‌లో కూడా సమంతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సమంతను మెయిన్‌ లీడ్‌లో ప్రజెంట్‌ చేస్తున్నారు. అయితే రెమ్యునరేషన్‌ మాత్రం కీర్తిసురేష్‌కే ఎక్కువ ఇచ్చారట. కానీ స్టార్‌డమ్‌ పరంగా చూసినా సరే సమంతకే ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇవ్వాలి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదట. కీర్తినేే ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకుందని తెలుస్తోంది. అయితే లేటెస్టుగా జరిగిన 'మహానటి' ఆడియో ఫంక్షన్‌లో సమంత పాత్ర సినిమాకి అత్యంత కీలకం, సమంత లేనిదే 'మహానటి' సినిమా లేదు అని స్వయంగా కీర్తి సురేష్‌ కూడా చెప్పింది. సమంతే ఈ సినిమాకి మెయిన్‌ స్టార్‌ అని చెప్పుకొచ్చింది. 

అంతేకాదు, సమంత నటించిన సన్నివేశాలు సినిమాకి అత్యంత కీలకమట కూడా. అందుకే హీరోయిన్‌గా కాకపోయినా, తన పాత్రకు అంత ఇంపార్టెన్స్‌ ఉండడంతోనే ఈ సినిమాలో నటించేందుకు సమంత ఒప్పుకుందట కూడా. జర్నలిస్ట్‌ పాత్రలో సమంత కనిపించబోతోంది ఈ సినిమాలో. పోస్టర్స్‌లో సమంత ఫీచర్స్‌, లుక్స్‌ చాలా డిఫరెంట్‌గా ఆకట్టుకుంటున్నాయి. అలాగే సమంతతో పాటు, విజయ్‌ దేవరకొండ పాత్రకీ ఇంపార్టెన్స్‌ ఎక్కువేనట. ఈ ఇద్దరి మధ్యా జరిగే సన్నివేశాలే సినిమాకు కీలకమట. 

ఏది ఏమైనా ఎవరి పాత్ర ఎంత? ఏ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్‌ అనేది మరి కొద్ది గంటల్లోనే తెలిసిపోనుంది. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS