గ్లామ్‌షాట్‌: క్యూట్‌ 'బేబీ' హాట్‌ పోజు సో 'స్వీట్‌' యా!

మరిన్ని వార్తలు

సమంత ఏం చేసినా క్యూట్‌గానే ఉంటుంది. ఈ మధ్య 'ఓ బేబీ' సినిమా ఆమెను మరింత అభిమానించేలా ఎట్రాక్ట్‌ చేస్తోంది. లేటెస్ట్‌గా విడుదలైన 'ఓ బేబీ' ట్రైలర్‌లో సమంత పర్‌ఫామెన్సే ఆ ప్రత్యేక అభిమానానికి ప్రత్యేక కారణం. అందుకే ఆమెకు సోషల్‌ మీడియాలో అంతగా ఫాలోయింగ్‌. పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో ఎక్కడా గ్లామర్‌కి చోటు లేకుండా చూసుకుంటోంది. ఓన్లీ పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌నే ఎంచుకుంటోంది.

 

కానీ, తనను మెచ్చి అభిమానిస్తున్న అభిమానుల కోసం అంటే, కూసింత కళాపోషకుల కోసం అన్నమాట.. ఇదిగో అప్పుడప్పుడూ ఇలా గ్లామర్‌ యాంగిల్‌కి పరదాలు లేపేస్తోంది. తాజాగా పిక్‌ చూస్తున్నారుగా. బ్రైడల్‌ వేర్‌లా కనిపిస్తున్న ఈ కాస్ట్యూమ్‌లో సమంత క్యూట్‌ లుక్స్‌తో పాటు, హాట్‌ అప్పీల్‌ కూడా అవలీలగా చేసేస్తోంది. సమంతను ప్రత్యేకంగా అభిమానించే వారి కోసం ఈ పిక్‌ అన్నట్లుంది కదా. క్రీమ్‌ కలర్‌ బ్రైడల్‌ వేర్‌లో సమంత ఇచ్చిన ఈ పోజు సింప్లీ సూపర్బ్‌ అంటున్నారు ఆమె ఫాలోవర్స్‌.

 

ఇకపోతే జూలై 5న 'ఓ బేబీ'తో మన బేబీ సమంత ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తోన్న సంగతి తెలిసిందే. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 70 ఏళ్ల బామ్మ 24 ఏళ్ల యువతిలా మారిపోతే ఎలా ఉంటుంది.? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో అన్ని వర్గాల వారినీ ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసేందుకు సమంత సిద్ధంగా ఉంది. ట్రైలర్‌ ఇచ్చిన కిక్‌తో ఎప్పుడెప్పుడు 'ఓ బేబీ' ధియేటర్స్‌కి వస్తుందా.? అని అందరూ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS