'వాల్మీకి'తో హరీష్‌ మ్యాజిక్‌ మజా.!

మరిన్ని వార్తలు

 'ఆయన శిఖరం తట్టుకోలేవు..' అంటూ 'ఖలేజా' సినిమాలో షఫీ, మహేష్‌బాబు గురించి చెప్పే డైలాగ్‌ ఒకటి ఉంటుంది. అలా ఇప్పుడు 'వాల్మీకి' ప్రీ టీజర్‌తో వరుణ్‌ తేజ్‌ శిఖరంలా నిలబడ్డాడు. ఆహా వాట్‌ ఏ మేకోవర్‌.. వాట్‌ ఏ ఎక్స్‌ప్రెషన్స్‌ అంటూ 'వాల్మీకి'గా వరుణ్‌ని చూసిన వారు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. తమిళ 'జిగర్తాండ' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఒరిజినల్‌లో బాబీ సింహా ఈ పాత్రను పోషించాడు. ఒరిజినల్‌లో బాబీ సింహా గెటప్‌కీ, వరుణ్‌ గెటప్‌కీ అస్సలు పోలిక లేదు.

 

కానీ, ఇద్దరూ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలే పోషిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌గా వరుణ్‌ ఇంతకు ముందెవ్వరూ కనిపించిన గెటప్‌ వేసేశాడు. అయితే, ఇంతకీ ఈ సినిమాలో ఇంకో హీరో కూడా ఉన్నాడు. ఆయనే అధర్వ మురళి. ఈ పాత్రను ఒరిజినల్‌లో సిద్దార్ధ నటించాడు. నిజానికి తమిళంలో అయితే సినిమాకి హీరో సిద్దార్ధనే. కానీ, తెలుగు వెర్షన్‌కొచ్చేసరికి కథలో కీలకమైన మార్పులు చేశాడు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌. అధర్వ ఈ సినిమాలో షార్ట్‌ ఫిలిం మేకర్‌గా కనిపిస్తాడు. పాత్రలు ఒరిజినల్‌లోనివే కానీ, కథా, కథనాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. వరుణ్‌ వైపు నుండి స్టోరీని నెరేట్‌ చేయాలి కాబట్టి, వరుణ్‌తేజే ఈ సినిమాకి హీరో. తమిళంలో అయితే, సిద్దార్ధ వైపు నుండి సినిమా ఉంటుంది. అక్కడ లక్ష్మీ అగర్వాల్‌ పోషించిన పాత్రను ఇక్కడ పూజా హెగ్దే నటిస్తోంది.

 

కానీ జోడీ మాత్రం వరుణ్‌కే. అదే వాల్మీకితోనే. తమిళ జిగర్తాండ స్టోరీ తెలిసినవారు ఈ సినిమాని ఆ సినిమాలో పోల్చుకోవడానిక అస్సలు అవకాశం లేదు. ఎందుకంటే థీమ్‌ మాత్రమే ఆ సినిమా నుండి తీసుకున్నాడు హరీష్‌ శంకర్‌. కథా, కథనాలన్నీ చాలా కొత్తగా ఉండబోతున్నాయట 'వాల్మీకి'కి. అవును ఒప్పుకుని తీరాల్సిందే. వరుణ్‌తేజ్‌ గెటప్‌తోనే అది ప్రూవ్‌ అయిపోయింది. ఏది ఏమైనా ఈ సస్పెన్స్‌ వీడాలంటే సెప్టెంబర్‌ 6 వరకూ ఆగాల్సిందే. ఆ రోజే 'వాల్మీకి' రిలీజ్‌ అయ్యేది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS