నాగ చైతన్యతో సమంత విడాకుల వ్యవహారం ముగిసిపోయింది. ఓ బంధానికి తెర పడింది. ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్లవే. ఇద్దరూ కెరీర్ పరంగా దృష్టి పెట్టాలని ఫిక్సయిపోయారు. చైతన్య చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇటీవలే `లవ్ స్టోరీ`తో హిట్టు కూడా కొట్టాడు. కాబట్టి... ఈ గాయం నుంచి కాస్త త్వరగానే కోలుకోగలడు. సమంత కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. నిన్నా మొన్నటి వరకూ కొత్త సినిమాలుఒప్పుకోవడానికి సమంత ఏమంత ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు మాత్రం కొత్త ప్రాజెక్టుల గురించి ఆరా తీస్తోందని టాక్.
అంతేకాదు.. సమంత త్వరలోనే ముంబై షిఫ్ట్ అయిపోతుందని టాక్. ఫ్యామిలీమెన్ 2 తరవాత బాలీవుడ్ నుంచి ఆమెకు కొత్తగా అవకాశాలొస్తున్నాయి. అయితే అందులో సరైనవాటినే ఎంచుకోవాలన్నది సమంత ఆలోచన. ముంబైలో కొన్నాళ్లు ఉండి, అవకాశాలు పోగేసుకోవాలనుకుంటోంది. అక్కడ ఓ ఫ్లాట్ కూడా కొందని ఇటీవలే వార్తలొచ్చాయి. అంటే.. కొంతకాలం ముంబైలో ఉండి, అవకాశాలకు జల్లెడ పడుతుందన్నమాట. తను చేసి `శాకుంతలం` ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇవి కాక మరో రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నట్టు సమాచారం.