సమంత.. సోషల్ మీడియాలో.. బాగా టచ్ లో ఉండే కథానాయిక. ఇన్‌స్ట్రా, ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో... ఎప్పటి కప్పుడు అప్ డేట్లు ఇస్తుంటుంది. అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది. తన సినిమాల విషయాలన్నీ చెబుతూనేఉంటుంది. అయితే ఇప్పుడు సమంత దూకుడు కాస్త తగ్గొచ్చు. ఎందుకంటే... కోర్టు ఆమెజోరుకి కళ్లాలు వేసింది. విషయం ఏమిటంటే..
ఇటీవల తనపై కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ సమంత కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. తన వైవాహిక జీవితం గురించి, విడాకుల గురించీ పుకార్లు లేవదీసిన కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేసింది. వీడియోల లింకులు తొలగించాలని కోర్టులో విన్నవించుకుంది. వీటిపై న్యాయ స్థానం సమంతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ వీడియో లింకుల్ని వెంటనే తొలగించాలని యూ ట్యూబ్ ఛానళ్లకు వార్నింగ్ ఇచ్చింది. అంతే కాదు.. సమంతకూ ఓ సలహా ఇచ్చింది.
ఇక మీదట.. వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం తగ్గించుకోవాలని సూచించింది. ఓ రకంగా.. సమంతకు ఇది మింగుడు పడని వ్యవహారమే. సోషల్ మీడియాలో ఇస్తున్న అప్ డేట్ల వల్ల.. యూ ట్యూబ్ ఛానళ్లకు ఫుటేజీ దొరుకుతున్నట్లు అవుతోంది. ఆ అప్ డేట్లు తగ్గించుకుంటే వార్తలూ తగ్గుతాయి. గాసిప్పులూ తగ్గుతాయి. అదీ.. కోర్టు సూచన. మరి సమంత దాన్ని ఎంత వరకూ పాటిస్తుందో?