మొన్నటికి మొన్న మామ నాగార్జున బర్త్‌డే సందర్భంగా, డిఫరెంట్ డిజైన్డ్ కాస్ట్యూమ్స్‌లో అందాలారబోసి, కనువిందు చేసిన అక్కినేని కోడలు సమంత తాజాగా మరోసారి నెట్టింట్లో వైరల్ అయ్యింది. అఫ్‌కోర్స్ సమంత నుండి ఎలాంటి పిక్ వచ్చినా, ఎలాంటిమెసేజ్ వచ్చినా కూడా అదో సెన్సేషనే. ఇక తాజా పిక్ విషయానికి వస్తే, కళంకారీ రన్నింగ్ ప్యాటర్న్ డిజైన్‌లో ఓ డ్రస్ ధరించింది సమంత. డ్రస్సులో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
కానీ, ఈ స్పెషల్ ఫోటో షూట్‌కి కారు బ్యాక్ సీట్‌ని వేదిక చేసుకుంది. ఆమె డ్రస్ కలర్‌కి కారు యాక్సెసరీస్ మ్యాచింగ్ కావడం, సైడ్ యాంగిల్‌లో సమంత ఇచ్చిన డిఫరెంట్ పోజు ఓ అందమైన ఖజురహో శిల్పాన్ని తలపిస్తోంది. కారులో ఖజురహో బొమ్మ అనేలా కనిపిస్తోంది. హై అండ్ ఫీచర్స్‌తో మెరిసిపోతున్న ఈ కారులో సమంత అందాలు మరింత మిరుమిట్లుగొలిపేలా ఉన్నాయి. అస్సలు ఆలస్యం చేయకుండా ఈ పిక్‌పై ఓ లుక్కేసేస్కోండి.