పాయల్ రాజ్‌పుత్ 'ఆర్ డీ ఎక్స్ లవ్' సినిమాని ఎందుకు ఒప్పుకుందో ట్రైలర్ చూశాక అర్ధమైంది. ట్రైలర్‌ని ఎంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారంటే, మాటలతోనే పిచ్చెక్కించేస్తోంది పాయల్ రాజ్‌పుత్. ఓ ఊరిని కాపాడేందుకు వచ్చిన ఆడపిల్ల కథ అంటూ మొదలైన ట్రైలర్‌లో పాయల్ రాజ్‌పుత్‌ని చాలా చాలా పవర్‌ఫుల్ రోల్‌లో చూపించారు. టీజర్ అంతా అడల్ట్ కంటెంట్‌తో డిజైన్ చేసి, సినిమాని 'ఆ' టైప్ మూవీ అనేలా ప్రమోట్ చేశారు. కానీ, ట్రైలర్ విషయానికి వస్తే, పాయల్ ఈ సినిమా ఒప్పుకుంది ఇందుకేనా.. అనిపించేలా ఉంది.
'వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించొచ్చు. కానీ, అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగ సింహం కూడా కుక్క పిల్లలా కనిపిస్తుంది..' అని పాయల్ చెప్పే డైలాగ్ కేక పుట్టించేస్తోంది. పక్కా పర్‌ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్‌లో పాయల్ కనిపిస్తోంది ఈ సినిమాలో. టీజర్ చూసి పాయల్‌ని అపార్ధం చేసుకుని, విమర్శించినవాళ్లకు ఇప్పుడు నోట మాట రావడం లేదు. అంతలా ఉంది ఈ ట్రైలర్. 'క్యారెక్టర్ ఉన్న ఆడదాని మాటే ఓ అగ్రిమెంట్‌రా..' అని విలన్ చెప్పే డైలాగ్ పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ బిల్ల్డప్ చెబుతోంది. తేజు కంచెర్ల హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు.