స్పెషల్‌గా చై, శామ్‌ క్రిస్‌మస్‌ సెలబ్రేషన్‌!

By Inkmantra - December 26, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

క్రిస్‌మస్‌ని సెలబ్రిటీలు చాలా హుషారుగా జరుపుకుంటారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంతలు మరీ ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ ఏడాది క్రిస్‌మస్‌ వేడుకల్లో భాగంగా, ఓ ఫన్నీ డాన్స్‌ వీడియోని సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో డాన్స్‌ చేస్తున్న ముగ్గురు డాన్సర్ల ముఖాలకి సమంత, చైతన్య, వారి పెంపుడు కుక్క హష్‌ ముఖాలున్న బొమ్మల్ని తగిలించి డాన్స్‌ చేస్తున్న వీడియో అది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. సమంతకు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌కి ఈ వీడియోని చాలా మందే వీక్షించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I must admit the coordination was hard ... but after a lot of practise ... Happy holidays ❤️❤️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

ఈ వీడియోని పోస్ట్‌ చేసి, అందరికీ స్పెషల్‌గా క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపింది సమంత. ప్రస్తుతం సమంత '96' రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం దాదాపు చివరి దశ షూటింగ్‌లో ఉంది. ఇక చైతూ విషయానికి వస్తే, రీసెంట్‌గా 'వెంకీ మామ'తో హిట్‌ కొట్టాడు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో చైతూకి జోడీగా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS