నాగచైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరపడింది. సమంత తాను విడిపోయామని నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ''ఇక నుంచి మేం భార్య-భర్తలుగావిడిపోతున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా ప్రైవసీ కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు చైతు.
కొద్ది రోజులుగా సమంత – నాగ చైతన్య విడాకుల అంశం హాట్ టాపిక్‌గా మరింది. వీరు ఎక్కడా జంటగా కనిపించడం లేదు. మెల్లగా విడాకుల అంశం తెరపైకి వచ్చింది. ఈ జంట మధ్య ఇటీవల అభిప్రాయబేధాలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే సమంత- చైతన్య ఇద్దరూ విడిగానే ఉంటున్నారు. ఇప్పుడు నాగ చైతన్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2021