మ‌రింత క‌న్‌ఫ్యూజ్ చేస్తున్న స‌మంత‌

మరిన్ని వార్తలు

నాగ‌చైత‌న్య - స‌మంత వ్య‌వ‌హారం ఇప్పుడు ఇండ్ర‌స్ట్రీలో హాట్ టాపిక్. వీరిద్ద‌రూ విడిపోతున్నార‌ని, విడాకుల వ‌ర‌కూ వెళ్లార‌ని, త్వ‌ర‌లోనే విడాకులు కూడా అందుతాయ‌ని చెప్పుకుంటున్నారు. దానికి తోడు... స‌మంత చేసే ప‌నులు కూడా అగ్నిలో ఆజ్యం పోసిన‌ట్టు త‌యార‌వుతున్నాయి. ఆ మ‌ధ్య ట్విట్ట‌ర్‌లో త‌న పేరు మార్చుకుంది స‌మంత‌. అక్కినేని స‌మంత అని తీసేసి కేవ‌లం `ఎస్‌` అనే అక్ష‌రాన్ని ఉంచుకుంది. అక్క‌డి నుంచి ఈ పుకార్ల‌కు బ‌లం చేకూరుతూ వ‌చ్చింది. ఇప్పుడు `ల‌వ్ స్టోరీ` ట్రైల‌ర్ చూసి, ఓ ట్వీట్ పెట్టింది. దాన్ని... సాయి ప‌ల్ల‌వికి ట్యాగ్ చేసింది. ఇది వ‌ర‌కు నాగ‌చైత‌న్య న‌టించిన ఏ సినిమాని మెచ్చుకోవాల‌న్నా.. ముందు చైతూని తెగ పొగిడేసేది. కానీ ఈ ట్వీట్ లో చైతూ అనే మాటే లేదు. త‌న ప్ర‌స్తావ‌న లేదు. క‌నీసం... త‌న‌కు ట్యాగ్ కూడా చేయ‌లేదు. దాంతో... వ్య‌వ‌హారం చాలా వ‌ర‌కూ వెళ్లిపోయింద‌ని అంటున్నారంతా. కానీ చైతన్య మాత్రం 'థాంక్స్ సామ్' అంటూ రిప్లై ఇచ్చాడు.

 

దానికి తోడు.. ఇద్ద‌రూ వేరు కాపురం పెట్టార‌ని, ఇద్ద‌రూ క‌ల‌సి ఉండ‌డం లేదని, స‌మంత ముంబైలోనో, చెన్నైలోనో ఉంటుంద‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి. సమంత ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కొంద‌ని, బాలీవుడ్ ప్ర‌య‌త్నాల నిమిత్తం... త్వ‌ర‌లో అక్క‌డికి షిఫ్ట్ అయిపోతుంద‌ని చెప్పుకుంటున్నారు. అస‌లు ఇవ‌న్నీ నిజాలేనా? లేదంటే కేవ‌లం పుకార్లేనా? అనేది తెలియాలంటే ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు నోరు మెద‌పాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS