'అఖండ' రిజ‌ల్ట్ బ‌న్నీకి ముందే తెలిసిపోయిందా?

By iQlikMovies - September 14, 2021 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

హిట్ ఎక్క‌డ ఉంటే... చిత్ర‌సీమ అక్క‌డ ఉంటుంది. ద‌ర్శ‌కులూ అంతే. హీరోలూ అంతే. హిట్ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి హీరోలు త‌హ‌త‌హ‌లాడుతూ ఉంటారు. సినిమాపై కాస్త పాజిటీవ్ బ‌జ్ వ‌చ్చినా చాలు. ఆ సినిమా రిలీజ్ కి ముందే... క‌ర్చీఫ్‌లు వేసేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే చేశాడు. `పుష్ష‌`తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్‌. ఆ త‌ర‌వాత `ఐకాన్` మొద‌లు అవుతుంది. ఐకాన్ త‌ర‌వాత ప్రాజెక్ట్ ఏమిట‌న్న విష‌యంలో బ‌న్నీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశాడు. ఈసారి బోయ‌పాటి శ్రీ‌నుతో ప‌నిచేయాల‌ని ఫిక్స‌య్యాడు.

 

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ‌తో బోయ‌పాటి చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు మొద‌లైపోయాయి. టీజ‌ర్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. దానికి తోడు మార్కెట్ స‌ర్కిల్ లో కూడా అఖండ గురించి బాగా చెప్పుకుంటున్నారు. ఈసినిమా గ‌న్ షాట్ గా హిట్ట‌వుతుంద‌ని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు బ‌న్నీ ముందుగానే బోయ‌పాటితో సినిమా చేయాల‌ని ప్రిపేర్ అయిపోయాడు. గీతా ఆర్ట్స్ తో అడ్వాన్స్ ఇప్పించాడు. ఇదే కాంబినేష‌న్ లో గ‌తంలో స‌రైనోడు వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కూ బ‌న్నీ కెరీర్‌లో అదే బిగ్గెస్ట్ హిట్. ఆ త‌ర‌వాత ఆ రికార్డుల‌న్నీ అలా వైకుంఠ‌పురంలో తిర‌గ‌రాసింది. ఇప్పుడు మ‌రోసారి బోయ‌పాటి తో మంచి మాస్ మ‌సాలా సినిమా చేయాల‌ని బ‌న్నీ ఫిక్స‌య్యాడు. త్వ‌ర‌లోనే ఈ కాంబో పై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS