రైల్వేస్టేషన్ లో హల్చల్ చేసిన సమంత-చైతు

By iQlikMovies - November 20, 2018 - 12:45 PM IST

మరిన్ని వార్తలు

స్టార్ కపుల్ అయిన నాగ చైతన్య-సమంతా తాజాగా రైల్వేస్టేషన్ లో చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నారు. అదేంటి వీరు ట్రైన్ లు ఎక్కడమేంటి అని అనుకుంటున్నారా? ఇది వారు నిజజీవితంలో కాదు, పెళ్ళయాక తామిద్దరూ కలిసి నటిస్తున్న తొలిచిత్రం ఇదే..

ఇక ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని సింహాచలం రైల్వేస్టేషన్ లో జరుగుతున్నది. అందులో భాగంగా నిన్న రైల్వేస్టేషన్ లో వీరిమధ్య ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాకి 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణా దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం పైన అంచనాలు పెరిగిపోయాయి.

ఇదిలావుండగా నాగ చైతన్య-సమంతా ఈమధ్య కాలంలో నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడంతో వారు కూడా ఈ చిత్రం పైన దృష్టి పెట్టడం జరిగిందని టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా సరే, ఈ చిత్రం తప్పక హిట్ చేయాలనే తపనలో ఈ స్టార్ కపుల్ ఉన్నట్టుగా సమాచారం.

చూడాలి.. ఈ ఇద్దరు కలిసి ఒకరికొకరు హిట్ ఇచ్చుకుంటారా లేదా అనేది వచ్చే ఏడాది తెలుస్తుంది...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS