షారుఖ్ కి ’కోర్టు’ చిక్కులు

By iQlikMovies - November 20, 2018 - 12:01 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజా చిత్రం ‘జీరో’ కి విడుదల ముందు కోర్టు చిక్కులు తప్పేలా లేదు. ఎందుకంటే ఈ చిత్రానికి సెన్సార్ అవ్వకుండా ఆపాలని ఒక న్యాయవాది ముంబై హైకోర్ట్ లో కేసు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకి ఆ వివాదం ఏంటంటే- జీరో ట్రైలర్ లో ఒక సన్నివేశంలో షారుక్.. సిక్కులు పవిత్రంగా భావించే కిర్పన్ ను పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళే సందర్భం సిక్కు మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అని అమృత్ పాల్ సింగ్ అనే న్యాయవాది కోర్టుని ఆశ్రయించారు.

ఈ ఫిర్యాదుని కోర్టు అనుమతించి ఈ నెల నవంబర్ 30న విచారణకి అనుమతినిచ్చింది. ఈ తరుణంలో షారుక్ ఖాన్ & కో కి సినిమా విడుదల ముందు తలనొప్పులు తప్పేలా కనిపించట్లేదు.

మరి ఈ వివాదాన్ని జీరో టీం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS