శాకుంతలమ్ తరవాత సమంత మరో సినిమా ఒప్పుకోలేదు. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలనిచూస్తున్నానని సమంత చెప్పేది. ఇటీవల గోవా టూర్ కూడా వేసింది. ఈలోగా.. చైతూతో విడిపోతోందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమంత మళ్లీ తెలుగు సినిమా చేయడానికి కాస్త సమయం పడుతుందనుకున్నారంతా. అయితే అనూహ్యంగా సమంత తన నిర్ణయం మార్చుకుంది. తెలుగులో ఓ కొత్త సినిమా చేయడానికి సంతకాలు చేసింది.
శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో సమంతనే కథానాయిక. దర్శకుడు ఎవరన్నది తెలియాల్సివుంది. ఆదిత్య 369 లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అందించారు కృష్ణ ప్రసాద్. ఈసారి కూడా ఓ చక్కటి కథని సిద్ధం చేశార్ట. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.