తెలుగులో హాలీవుడ్ స్థాయి సినిమాలు తీశాడు రాజమౌళి. తన సృజన, ఆలోచన విధానం... అబ్బుర పరిచాయి. అలాంటి రాజమౌళి, హాలీవుడ్ లో, హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో, వేల కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? దిమ్మతిరిగిపోతుంది కదూ. ప్రస్తుతం రాజమౌళి అలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడని సమాచారం. రాజమౌళి బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అలాంటి ఆఫర్లు కూడా తనకు చాలా వచ్చాయి.
అయితే... వర్కవుట్ కాలేదు. కానీ ఈసారి ఏకంగా హాలీవుడ్ సినిమానే తెరకెక్కించబోతున్నాడు. అవును.. రాజమౌళి త్వరలోనే హాలీవుడ్ సినిమా చేయబోతున్నాడని టాక్. దీనికి సంబంధించి ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థతో రాజమౌళి చర్చలు మొదలెట్టాడని సమాచారం అందుతోంది. ఆర్.ఆర్.ఆర్ ముగిసిన వెంటనే, మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలి రాజమౌళి. ఆ తరవాత... ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ తెరపైకెళ్తుంది.
తెలుగు సినిమానే ఏళ్లకు ఏళ్లు తీస్తుంటాడు రాజమౌళి. హాలీవుడ్ సినిమా అంటే కనీసం ఐదేళ్ల పాటు తెలుగువాళ్లకు కనిపించడు. అది కాస్త క్లిక్కయితే రాజమౌళి ఇక హాలీవుడ్ కే పరిమితం అయిపోతాడేమో?